కోర్టుకు హాజరైన లోకేశ్‌  | Nara Lokesh Vijayawada additional Metropolitan Magistrate Court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన లోకేశ్‌ 

Published Tue, May 24 2022 5:16 AM | Last Updated on Tue, May 24 2022 8:30 AM

Nara Lokesh Vijayawada additional Metropolitan Magistrate Court - Sakshi

కోర్టుకి హాజరై బయటకు వస్తున్న లోకేశ్‌

విజయవాడ లీగల్‌: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ నేతలు పలువురు ఓ ధర్నా కేసులో సోమవారం విజయవాడ ఒకటో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడిని 2020 జూన్‌ 12న అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.

ఆ సమయంలో కోవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంపై దాఖలైన కేసులో మాజీ మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్రలతో పాటు నాయకులు పట్టాభిరామారావు, దేవినేని చంద్రశేఖర్, జాస్తి సాంబశివరావులపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వీరు సోమవారం కోర్టుకు హాజరయ్యారు. విచారించిన న్యాయాధికారి జ్యోత్స్న కేసును జూలై 28కి వాయిదా వేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement