
మాట తప్పం..మంచి చేస్తాం
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
కోనేరుసెంటర్(పెదయాదర) : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బుధవారం పెదయాదర, ఎన్ గొల్లపాలెం గ్రామాల్లో జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’లో మంత్రి పాల్గొన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఫించన్లు అందజేశారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొని మహిళలను ఆశీర్వదించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాల రద్దుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. బందరు నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా అధికారులను ప్రజల ముందుకు తీసుకు రావడం జరుగుతుందన్నారు.
పెదయాదరలో జరిగిన సభకు ఎంపీడీవో జివి. సూర్యనారాయణ, ఎన్ గొల్లపాలెంలో జరిగిన సభకు తహశీల్దార్ బి.నారదముని అధ్యక్షత వహించారు. జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, మండల అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, పెదయాదర సర్పంచి కంచర్లపల్లి నటరాజకుమారి, ఎన్‌గొల్లపాలెం సర్పంచి జెడ్డు వడ్డీకాసులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీ ఊసా వెంకటసుబ్బారావు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
బీచ్ వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలి...
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్‌కు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మంత్రి పలువురు అధికారులతో కలిసి మంగినపూడి బీచ్‌ను సందర్శించారు. ఆయన బీచ్ వద్ద చేసిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. కార్తీకమాసం సందర్భంగా మంగినపూడి బీచ్‌కు సుమారు లక్షకుపైగా భక్తులు వస్తారని చెప్పారు.
వారికి అవసరమైన బాత్‌రూంలు, డ్రెసింగ్‌రూంలు, వ్యక్తిగత మరుగుదొడ్లు ఇలా భక్తులకు అవసరమైనసౌకర్యాలు కల్పించాలని సూచించారు. మంత్రితో పాటు రూరల్ సీఐ ఎస్‌వీవీఎస్. మూర్తి, రూరల్ ఎస్సై ఈశ్వర్‌రావు, సహాయ టూరిజం అధికారి రామలక్ష్మణ్, డివిజనల్ పంచాయతీ అధికారి జె.సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, వైస్ ఎంపీపీ ఊసా వెంకటసుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.