రేపు సీఎం చంద్రబాబు జిల్లాకు రాక
కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 13న జిల్లాకు రానున్నారు. జిల్లాలోని నిమ్మలగూడేనికి హెలికాఫ్టర్‌లో వచ్చి, ఉదయం 10.35 నుంచి 11 వరకు ఉపాధిహామీ పనులు పరిశీలిస్తారు. అంగన్‌వాడీ సెంటర్‌ను తనిఖీ చేస్తారు. అనంతరం చింతూరులోని ఎర్రంపేటకు 11 గంటలకు వెళ్లి సబ్ ట్రెజరీని ప్రారంభిస్తారు. జీసీసీ పెట్రోలు బంక్, ఎల్‌పీజీ గోడౌన్‌కు శంకుస్థాపన చేస్తారు. ఐటీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించి, పీఓ, స్టాఫ్ క్వార్టర్లకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం కూనవరం, చింతూరు సీహెచ్‌సీ భవనాలకు, చింతూరు-వీఆర్ పురం, నెల్లిపాక-పోచవరం ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆర్‌డబ్ల్యూఎస్ పనులకు, ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన చేసి, అనంతరం ఏపీ రెసిడెన్షియల్(గిరిజన సంక్షేమ) జూనియర్ కళాశాలలో ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 17 వేల ప్రిమ్ టు ట్రైబల్ గ్రూపు కుటుంబాలకు చంద్రన్న పౌష్టికాహార కానుక ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు, దీపం కనెక్షన్లు, ఉపకరణాలు పంపిణీ చేస్తారు.