మంత్రికి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుల వినతి పత్రం | YSR Congress Party kuwait members submit to letter kollu ravindra | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మంత్రికి వినతి పత్రం అందించిన వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కమిటీ

Published Thu, Feb 22 2018 7:47 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

YSR Congress Party kuwait members submit to letter kollu ravindra - Sakshi

కువైట్ : వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కమిటీ సభ్యులు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష ద్వారా స్వస్ధలం వెళుతున్న వారికి ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి కోల్లు రవీంద్రకు వినతి పత్రం అందించారు. కువైట్ ప్రభుత్వం జనవరి 29న ఆఖమా లేని వారు ఏజంట్ల చేతిలో మోసపోయి పాస్ పోర్ట్ లేనివారిపై ఎటువంటి కేసులు, జరిమానా లేకుండా వెళ్లి మళ్ళి కొత్త వీసాలకు అవకాశం కల్పించింది. దీంతో కువైట్‌లో ఉన్న తొమ్మిది వేల మంది అభాగ్యులు ఏడు సంవత్సరాల తరవాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటున్నారు. వారిలో టికెట్లకు డబ్బులు లేక అవస్ధలు పడుతున్న అభాగ్యలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి అభాగ్యులను రాష్ట్ర  ప్రభుత్వం ఆదుకోవాలని గతంలో పత్రిక ముఖంగా గల్ఫ్, కువైట్ ప్రతినిధులు ఏపీఎన్‌ఆర్‌టీ,  ప్రభుత్వం పై విమర్శించగా ఎట్టకేలకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ మంత్రి  కొల్లు రవీంద్ర  ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు చైర్‌పర్సన్ వేమూరి రవి ఈ నెల 20న  కువైట్ విచ్చేసిన సందర్బంగా తెలుగు వారి తరుపున  వైఎస్‌ఆర్‌సీపీ కువైట్  కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కమిటీ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం తెలుగువారి కష్టాలపైన  వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ..  క్షమాబిక్ష సమయంలో ఇండియా వచ్చిన అభాగ్యులను అన్ని విధాలుగా ఆదుకొని వారికి  పునరావాసం కల్పించాలని కోరారు. ఇక్కడ నుంచి వెళ్లే పేద వారిని ప్రభుత్వ తరుపున టికెట్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అలాగే మన తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు దిగేటట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మనవి చేశారు. 

కో కన్వినర్లు గోవిందు నాగరాజు ఎంవీ నరసారెడ్డి మాట్లాడుతూ.. కువైట్ లో పని చేస్తున్నపుడు అకస్మాత్తుగా మరణించిన వారి పార్ధవ శరీరాన్ని భారత దేశం లోని విమానాశ్రయం తమ స్వస్థలికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కువైట్ వచ్చిన పేద బడుగు వర్గాల వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను రద్దు చేయవద్దని కోరారు. 

ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మీడియా ప్రతినిది మాట్లాడుతూ..  కువైట్ ప్రమాదంలో మరణించిన వారికీ, ప్రమాదంలో వికలాంగులు అయిన వారికీ భీమా ద్వారా ఆదుకోవాలన్నారు. దొంగ ఏజంట్ల నుంచి అమాయక ప్రజలను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు అబుతురాబ్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ విభాగం లీడర్ రమణ యాదవ్, యువజన విభాగం లీడర్ మర్రి కళ్యాణ్, ఎస్సీ, ఎస్టీ విభాగం బీఎస్‌ సింహ, పిడుగు సుబ్బారెడ్డి, షేఖ్ సబ్దర్ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement