
కొల్లు రవీంద్ర
సాక్షి, కృష్ణా జిల్లా : ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు పెను ప్రమాదం తప్పింది. కంకిపాడు గుండా వెళుతున్న మంత్రి ఎస్కార్ట్‌లోని వాహనానికి ద్విచక్ర వాహనం ఎదురుగా రావడంతో ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తూ ఆయన ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా వేరే వాహనంలో ఆయన విజయవాడకు చేరుకున్నారు.