![Former Minister Kollu Ravindra Was Arrested By Police In Andhra Pradesh - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/07/10/kollu-ravindra-arrest.jpg.webp?itok=WOz4nD9w)
కృష్ణా: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో ఆక్రమణల తొలగింపును మున్సిపల్ అధికారులను చేపట్టారు. అయితే రవీంద్ర కల్సించుకుని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా వారు ఎంత చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు వచ్చి రవీంద్రను అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించారు. అయినప్పటికీ వినకపోవడంతో పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్న కారణంగా కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment