సీసీటీవీలను వాడి పోలీసులకు షాకిచ్చారు!
సీసీటీవీలను వాడి పోలీసులకు షాకిచ్చారు!
Published Sun, May 8 2016 8:38 PM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM
న్యూఢిల్లీ: నేటి హైటెక్ యుగంలో నేరం జరిగితే సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పసిగట్టి నేరస్థుడిని అరెస్టు చేయడం తెలిసిందే. కానీ, ఇందుకు భిన్నంగా ఢిల్లీకి చెందిన ఓ గ్యాంబ్లింగ్ ముఠా ఏకంగా పోలీసుల మీద నిఘా పెట్టేసింది. దక్షిణ ఢిల్లీలోని వసంత్ గావ్ ఏరియా లో అక్రమంగా గ్యాంబ్లింగ్ నడుపుతున్న ఓ ఇంటిపై పక్క సమాచారంతో ఎన్నిసార్లు సర్-ప్రైజ్ విజిట్ లు చేసినా.. ఎవరూ దొరకలేదు.
దీంతో విచారించిన పోలీసులకు ఆ ఇంటి పరిసరప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని అందుకనే ఎవరూ దొరకడం లేదని తెలుసుకున్నారు. ముఠాను పట్టుకునేందుకు పకడ్బందీ వ్యుహం రచించారు. ఇందుకోసం ఆ ఇంటి వద్దకు వెళ్లగా ఇంటి ఓనర్ ఓ మహిళ పోలీసులను అడ్డుకోవడమే కాకుండా తనను వేధిస్తున్నారంటూ ఆరోపించింది. సీసీటీవీ ఫుటేజ్ లు కూడా ఉన్నాయని బెదిరించడంతో వెనుదిరిగిన పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో మహిళలతో పోలీసులను బెదిరించడమే కాకుండా అక్రమంగా మద్యం, డ్రగ్స్ ను అమ్ముతున్న వారిని ఎట్టకేలకు ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాటిపై నిఘాను పెంచెందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement