ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. అజంగఢ్ జిల్లా ముబారక్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరణించిన వారిలో ఎక్కువగా కార్మికులు, పేదలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మద్యం వ్యాపారులు నీళ్లలో స్పిరిట్ను కలిపి చౌక ధరకు విక్రయించడం ద్వారా పరిస్థితి విషమించినట్టు అధికారులు తెలిపారు.
ఈ సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఓం ప్రకాష్ సింగ్తో సహా పదిమంది అధికారుల్ని సస్పెండ్ చేసింది. న్యాయ విచారణకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్ కల్తీ మద్యం సంఘటనలో 37 మంది మృతి
Published Sat, Oct 19 2013 3:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement