'ఆ మద్యం' అమ్ముతూ పట్టుబడ్డాడు! | illicit liquor seller arrest at vizag | Sakshi
Sakshi News home page

'ఆ మద్యం' అమ్ముతూ పట్టుబడ్డాడు!

Published Mon, Oct 19 2015 4:24 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

illicit liquor seller arrest at vizag

గాజువాక : ఏపీలో ఇప్పటికే ఓపెన్ బార్లు, వైన్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. ఇది చాలదన్నట్లు ఓ వ్యక్తి వెరైటీగా  మద్యం విక్రయిస్తూ  కటాకటాల పాలయిన ఘటన వైజాగ్లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే... గాజువాక బీసీ రోడ్డుకు చెందిన శంకర్‌రావు అనే వ్యక్తి డిఫెన్స్ మద్యాన్ని విక్రయిస్తున్నాడు. నేవీ ఉద్యోగులకు సరాఫరా చేసే మద్యాన్ని తక్కువ ధరకు శంకర్రావు కొనుగోలు చేసేవాడు. దానిని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. దీనిపై ఎక్సైజ్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో అతని ఇంటిపై దాడి చేసి 150 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శంకర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement