అక్రమార్జన కేసులో మూడేళ్ల జైలు | retired excise driver prisoned by illegal assets | Sakshi
Sakshi News home page

అక్రమార్జన కేసులో మూడేళ్ల జైలు

Published Fri, May 29 2015 11:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

ఆదాయానికి మించి ఆస్తులు కూడటెట్టిన కేసులో నెల్లూరు మద్యపాన నిషేధం విభాగం రిటైర్డు ఉద్యోగికి ఏసీబీ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు, రూ.15 లక్షల జరిమానా విధించింది.

నెల్లూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడటెట్టిన కేసులో నెల్లూరు మద్యపాన నిషేధం విభాగం రిటైర్డు ఉద్యోగికి ఏసీబీ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు, రూ.15 లక్షల జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన షేక్ కాలేషా 1971లో ప్రొహిబిషన్ శాఖలో వ్యాను క్లీనర్‌గా ఉద్యోగం పొందారు. అనంతరం జీపు డ్రైవర్‌గా 2005లో రిటైరయ్యారు. అయితే, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదు మేరకు అదే ఏడాది ఏసీబీ అధికారులు కాలేషా ఆస్తులపై దాడులు చేశారు.


ఆయనకు నగరంలో వీనస్ బార్ అండ్ రెస్టారెంట్‌తో పాటు రెండు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు రూ.2, 26, 370 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆదాయం అంతా అదనపు ఆస్తియేనని తేల్చిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో రూ.49 లక్షల మేర కాలేషాకు అదనపు ఆస్తులున్నట్లు రుజువు కావటంతో మూడేళ్ల జైలు, రూ.15 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement