సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేసు కేసు (Formula E Car Race Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (ktr)కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జనవరి 6న ఈ-కార్ రేసు కేసు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇప్పటికే ఇదే కేసులో ఈడీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఏసీబీ సైతం నోటీసు జారీ చేయడం చర్చాంశనీయంగా మారింది.
ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో ఏసీబీ కంటే ముందే ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది.
ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
👉చదవండి : కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment