పట్టుబడిన నగదుతో బూర్జ వీఆర్వో ఆర్.బలరాం
సాక్షి, సీతానగరం(విజయనగరం) : భూములు ఆన్‌లైన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఉద్యోగిని ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. లంచం ఇచ్చిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోను విచారణ జరపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... సీతానగరం మండలం బూర్జ రెవెన్యూ పరిధిలోని చెల్లన్నాయుడువలస గ్రామానికి చెందిన రైతు భాస్కరరావు తన భూములను ఆన్‌లైన్ చేయాలని వీఆర్వో రాయిపిల్లి బలరాంకు విన్నవించాడు. భూముల పత్రాలను సైతం అందజేశాడు. ఏడాదిగా తిరుగుతున్నా ఇప్పటికీ పని పూర్తిచేయలేదు. ఇప్పటికే కొంత మొత్తాన్ని లంచంగా ముట్టచెప్పాడు. మళ్లీ లంచం డిమాండ్ చేయడంతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారి సూచనల మేరకు లంచం ఇస్తానని వీఆర్వోకు భాస్కరరావు నమ్మబలికాడు. వీఆర్వో సూచనల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వస్తానని చెప్పాడు. లంచం డబ్బుల కోసం ఉదయం 11.30 గంటలకే తహసీల్దార్ కార్యాలయానికి వీఆర్వో చేరుకున్నాడు. రైతు కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పటికే వలపన్నిన ఏసీబీ అధికారులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంచం ఇవ్వాల్సిన రూ.9 వేలును దాసరి భాస్కరరావుకు అందజేశారు. వాటిని తీసుకెళ్లి రైతు ఇస్తుండా వీఆర్వోను ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment