
సాక్షి, హైదరాబాద్: కేశంపేట తహశీల్దార్ లావణ్య ఏసీబీ విచారణకు సహకరించట్లేదు. శుక్రవారం ఉదయం ఆమెను చం చల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. విచారణ ప్రారంభించగానే తల తిరుగుతోందని, వాంతు వచ్చేలా ఉందంటూ ప్రశ్నలు అడగనీయకుండా చేసి నట్లు తెలిసింది.
వీడియో చూసి మౌనం..
ఇటీవల ఏసీబీ దాడిలో లావణ్య వద్ద రూ.93 లక్షల నగదు లభించిన విష యం తెలిసిందే. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిం దన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. రూ.35 లక్షలు సింగిల్ సెటిల్‌మెంట్ అనడానికి తమ వద్ద ఉన్న వీడియో సాక్ష్యాలను అధికారులు ఆమె ముం దుంచినట్లు సమాచారం. వాటిని చూడగానే ఆమె మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు విచారించినా ఆమె నుంచి ఏసీబీ అధికారులు సమాధానాలు రాబట్టలేకపోయారు. శనివారం మధ్యాహ్నం వరకే సమయం ఉండటంతో ఈ లోపు ఆమె చేత నిజాలు చెప్పించగలరా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరో రూ.36.8 లక్షల గుర్తింపు..
ఏసీబీ దాడి చేసిన రోజు రూ.36.8 లక్షలను లావణ్య ఆమె బంధువుల ఖాతాల్లో గుర్తించారు. ఆమె సోద రుడి ఖాతాలో రూ.20.5 లక్షలు, నల్లగొండలోని బంధువు ఖాతాలో రూ.8 లక్షలు, లావణ్య ఖాతాలో రూ.5.99 లక్షలు, భర్త వెంకటేశం బ్యాంకు ఖాతాలో రూ.1.36 లక్షలు, ఇవి కాకుండా లావణ్యకే చెందిన మరో 2 ఖాతాల్లో రూ.40 వేలు, రూ.50 వేలు రూ.36.8 లక్షల సొమ్ము గుర్తించారు. ఇందులో లావణ్య ఖాతాలో ఉన్న సొమ్ము ఆమె వేతనంగా భావిస్తున్నారు. కేశంపేట తహశీల్దార్‌గా నియామకం కావడం కంటే ముందు లావణ్య ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పనిచేశారు. అక్కడ పరిచయమైన ఓ అధికా రిని తన బంధువు అని చెప్పుకొంటూ పలు లావాదేవీల్లో ఆ అధికారి పేరును వాడుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment