ఒకరితో సహజజీవనం..మరోకరితో ప్రేమాయణం..చివరికీ.. | Living With Someone Love With Someone Else Finally | Sakshi
Sakshi News home page

ఒకరితో సహజజీవనం..మరోకరితో ప్రేమాయణం..చివరికీ..

Published Sun, Jul 23 2023 8:26 AM | Last Updated on Sun, Jul 23 2023 8:26 AM

Living With Someone  Love With Someone Else  Finally - Sakshi

హైదరాబాద్: యువతిని గాఢంగా ప్రేమించాడు.. ఆమె ఫొటోను ఛాతిమీద పచ్చబొట్టుగా వేయించుకున్నాడు... పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు...ఆమెతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ప్రియురాలు నో చెప్పడంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కర్నూలుకు చెందిన శివ ప్రసాద్‌(23) ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

కొంత కాలంగా ఫిలింనగర్‌లోని దుర్గా భవానీనగర్‌లో గది అద్దెకు తీసుకొని కవిత అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఒక వైపు సహజీవనం చేస్తూనే మరో వైపు అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సుతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆమె ఫొటోను..పేరును కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. తనతో సహజీవనం చేస్తూ మరో యువతితో ప్రేమ పేరుతో తిరుగుతున్న శివ ప్రసాద్‌ను సహజీవనం చేస్తున్న  యువతి కవిత మూడు రోజుల క్రితం నిలదీసింది.

ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను మోసం చేశాడని భావించిన కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది జరుగుతుండగానే శుక్రవారం సాయంత్రం ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుందామని శివ ప్రసాద్‌ అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. సహజీవనం చేస్తున్న యువతి నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చేరడం, ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించకపోవడంతో శివప్రసాద్‌ శనివారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోలుకున్న యువతి కవితను పోలీసులు ఆస్పత్రి నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement