వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రేమ పెళ్లి జరిగింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా చింతూరులో సోమవారం చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి(చింతూరు): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రేమ పెళ్లి జరిగింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా చింతూరులో సోమవారం చోటుచేసుకుంది. చింతూరు మండలం మామిళ్లగూడెంకు చెందిన ప్రమీళ, మారేడిమిల్లి మండలానికి చెందిన శివప్రసాద్ లు హైదరాబాద్‌లో ఓ ఫ్యాక్టరీ పనిచేశారు. ఆ సమయంలో వీరు ఒకరునొకరు ప్రేమించుకున్నారు.
అయితే శివ ప్రసాద్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రమీళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జంటకు కౌన్సెలింగ్ నిర్వహించగా ఇరువురు అంగీకరించారు. అయితే వీరి తల్లిదండ్రులకు వైఎస్సార్ సీపీ నేతలు నచ్చజెప్పి పార్టీ ఆధ్వర్యంలో పెళ్లి జరిపించారు.