![Bollywood Top 5 Weekend Collections Movies Till 2018 May - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/4/boxoffice.jpg.webp?itok=1XSeSHhJ)
సాక్షి, సినిమా : పద్మావత్ సినిమాతో బాలీవుడ్‌లో ఈ ఏడాది శుభారంభం మొదలైంది. దీపావళికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాపడుతూ జనవరిలో విడుదలైంది. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. మొదటి వారాంతంలోనే 114 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది బాలీవుడ్‌లో ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నంటిలో పద్మావత్ సినిమానే వీకెండ్ కలెక్షన్స్‌లో టాప్‌లో కొనసాగుతోంది.
ఆ తరువాతి స్థానంలో భాగీ-2 నిల్చింది. తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ నటించారు. ఈ యాక్షన్, సస్పెన్స్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో దాదాపు 70 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించిన ‘రెయిడ్’ 41కోట్ల రూపాయలతో మూడోస్థానంలో, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్‌మాన్’ 40 కోట్ల రూపాయలతో నాలుగోస్థానంలో, కరీనా కపూర్, సోనమ్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ 36 కోట్ల రూపాయలతో ఐదో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment