
ఐటీలో అవినీతి తిమిగలం
న్యూఢిల్లీ: సీబీఐ అధికారుల దాడిలో ఆదాయ పన్ను శాఖలో అవినీతి తిమిగలం చిక్కింది. కోల్‌కతాలోని ఆయన గృహంపై దాడి చేసిన సీబీఐ అధికారులు.. నాలుగు కేజీల బంగారం, రూ.3.5 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ మేరకు సీబీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన తపస్ కుమార్ దత్తా కొన్నాళ్లుగా కోల్‌కతాలో ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
ఈయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన సీబీఐ.. కోల్‌కతా, జార్ఖండ్‌లలోని 23 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు రూ.3.5 కోట్ల నగదు, నాలుగు కేజీలకు పైగా బంగారం పట్టుబడింది. దత్తాతో పాటు మరో ముగ్గురు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఓ వ్యాపారవేత్తతో కలిసి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని సీబీఐ వెల్లడించింది.