కాకినాడ : బీఎస్‌ఆర్ సంస్థల అధినేత బలుసు శ్రీనివాసరావు నివాసంలో బుధవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిదలోని బీఎస్ఆర్ స్వగృహంలో విశాఖపట్నం నుంచి వచ్చిన ఆరుగురు ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. బీఎస్‌ఆర్ సంస్థల పేరిట కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల టర్నోవరుతో కాంట్రాక్టు పనులు, పలు వ్యాపారాలను శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు.
టీడీపీలో బీఎస్ఆర్ క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉంటారన్న ప్రచారం కూడా ఉంది. ఇటీవల రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయలు విలువైన సుమారు 12.5 ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇదే జిల్లాలోని ఆలమూరు మండలం మోదుకూరులోని శ్రీనివాసరావు మామగారైన గుణ్ణం వీర్రాజు నివాసంలోనూ మరో ఐటీ బృందం తనఖీలు నిర్వహిస్తోంది.
బీఎస్ఆర్ నివాసంలో ఐటీ సోదాలు
Published Wed, May 25 2016 10:35 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement
Advertisement