చైల్డ్ పోర్నోగ్రఫిపై స్పెషల్ రైడ్ | Spain police arrest 81 in child pornography raid | Sakshi
Sakshi News home page

చైల్డ్ పోర్నోగ్రఫిపై స్పెషల్ రైడ్

Published Sat, Oct 17 2015 6:02 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

చైల్డ్ పోర్నోగ్రఫిపై స్పెషల్ రైడ్ - Sakshi

చైల్డ్ పోర్నోగ్రఫిపై స్పెషల్ రైడ్

స్పెయిన్ :  ఇంటర్నెట్లో బాలల పోర్నోగ్రఫీ చిత్రాలు చూస్తున్న, షేర్ చేస్తున్న వారిపై స్పెయిన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. దేశ వ్యాప్తంగా శనివారం దాడులు జరిపిన పోలీసులు.. 81 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండగా మరో ఇద్దరు మతి స్థిమితం లేనివారు ఉన్నారు.

స్పెయిన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 300 మంది పోలీసులు దేశవ్యాప్తంగా 28 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపి బాలల అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు పంపిణీ చేస్తున్న వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుండి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గత కొన్ని నెలలుగా.. అంతర్జాలం ద్వారా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై నిపుణులతో కూడిన నిఘాను ఏర్పాటు చేసి పక్కా సమాచారంతో ఈ దాడులు జరిపారు. నిందితులపై చైల్డ్ పోర్నోగ్రఫీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement