నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఔషధ నియంత్రణ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
నల్గొండ (మిర్యాలగూడ) : నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఔషధ నియంత్రణ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీరేపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన లక్ష రూపాయల విలువైన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మందులను అక్రమంగా నిల్వ ఉంచుతున్నారనే ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు.