CBI Raid In Delhi Cop Taking Bribe Being Tackled, Video Viral - Sakshi
Sakshi News home page

సీబీఐ స్కెచ్‌.. వలలో చిక్కిన హెడ్‌ కానిస్టేబుల్.. వీడియో వైరల్‌..

Published Wed, Jul 12 2023 5:21 PM | Last Updated on Wed, Jul 12 2023 6:22 PM

CBI Raid In Delhi Cop Taking Bribe Being Tackled Video Viral - Sakshi

ఢిల్లీ: ఢిల్లీలో లంచం తీసుకుంటున్న హెడ్‌ కానిస్టేబుల్‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓ దుకాణాదారుడి వద్ద రూ.50,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. దేశ రాజధానిలోని మొగలిపురా ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

 మొగలిపురా ప్రాంతంలో బీమ్‌ సింగ్ పోలీస్ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. స్థానికంగా ఓ దుకాణాదారుని షాప్‌ ముందు పార్కింగ్ అంశంలో డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.50,000 ఇవ్వాలని ఆ షాప్‌కీపర్‌పై ఒత్తిడి పెంచాడు. విసిగిపోయిన దుకాణాదారుడు సీబీఐ అధికారులకు సమాచారం అందించాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. వ్యూహం ప్రకారం రంగంలోకి దిగారు. 

పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని నమ్మించి ఆ షాప్‌ కీపర్ పోలీస్ కానిస్టేబుల్‌ను దుకాణం ముందుకు రప్పించాడు. అక్కడా కాపుగాసిన అధికారులను గమనించిన కానిస్టేబుల్ దుకాణదారుని నుంచి లంచం తీసుకోబోయాడు. వెంటనే అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా బీమ్‌ సింగ్‌ను పట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.  

ఇదీ చదవండి: బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని కొట్టడంతో బాలిక ఆత్మహత్య


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement