సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్..
ఢిల్లీ: ఢిల్లీలో లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓ దుకాణాదారుడి వద్ద రూ.50,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. దేశ రాజధానిలోని మొగలిపురా ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
#WATCH | CCTV footage of CBI raid under Mangolpuri Police Station area in Delhi on 10th July where one of the accused Head Constable Bheem Singh was seen attempting to flee, but he was caught. CBI has registered FIR against two head constables in a bribery case.
(Source: CCTV… pic.twitter.com/qeoka3n40t
— ANI (@ANI) July 12, 2023
మొగలిపురా ప్రాంతంలో బీమ్ సింగ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. స్థానికంగా ఓ దుకాణాదారుని షాప్ ముందు పార్కింగ్ అంశంలో డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.50,000 ఇవ్వాలని ఆ షాప్‌కీపర్‌పై ఒత్తిడి పెంచాడు. విసిగిపోయిన దుకాణాదారుడు సీబీఐ అధికారులకు సమాచారం అందించాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. వ్యూహం ప్రకారం రంగంలోకి దిగారు.
పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని నమ్మించి ఆ షాప్ కీపర్ పోలీస్ కానిస్టేబుల్‌ను దుకాణం ముందుకు రప్పించాడు. అక్కడా కాపుగాసిన అధికారులను గమనించిన కానిస్టేబుల్ దుకాణదారుని నుంచి లంచం తీసుకోబోయాడు. వెంటనే అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా బీమ్ సింగ్‌ను పట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని కొట్టడంతో బాలిక ఆత్మహత్య