మృత్యుంజయుడు | Lucky man came out of of the accident | Sakshi
Sakshi News home page

మృత్యుంజయుడు

Published Sun, Apr 10 2016 9:24 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

మృత్యుంజయుడు - Sakshi

మృత్యుంజయుడు

♦ పూడిక తీస్తుండగా కూలిన బావి
♦ జేసీబీ సాయంతో సమాంతరంగా బావి తవ్వకం
♦ సురక్షితంగా బయటపడిన వైనం
 
 చింతకాని: ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పూడిక తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ఏడుగంటలపాటు బావిలో కూరుకుపోయి మృత్యువు అంచులదాకా వెళ్లి సజీవంగా బయటపడ్డాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడుకు చెందిన టేకుమట్ల సైదులు శనివారం పూడిక తీయడం కోసమని తన ఇంట్లో ఉన్న బావిలో ఇద్దరు కూలీలతో పాటు దిగాడు. పూడిక తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా బావి చుట్టూ ఉన్న భూమి కూలి మట్టి సైదులుపై పడింది. ఇదే సమయంలో కూలీలిద్దరూ తప్పుకున్నారు.

మట్టిపైన రాయిపడి ఆపైన మళ్లీ మట్టి పడింది. వెంటనే స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూటీం వచ్చి.. సైదులుకు ఆక్సిజన్ అందుతున్నట్లు గుర్తించింది. వెంటనే జేసీబీతో బావికి సమాంతరంగా మరో బావి  తవ్వారు. సుమారు ఏడు గంటల తర్వాత సైదులను బావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement