Khammam government hospital
-
ముక్కు నొప్పితో ఆసుపత్రికి.. వైద్యం వికటించి వివాహిత మృతి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దాస్పత్రిలో ఓ మహిళ ముక్కుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించిన బంధువులు, అంతటితో ఆగకుండా మృతురాలిని ఉంచిన ఐసీయూ అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి బంధువుల కథనం ప్రకారం... ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోటకు చెందిన వెంకటలక్ష్మి, ముత్తయ్య భార్యాభర్తలు. వెంకటలక్ష్మి25)కి ముక్కులో గడ్డ ఏర్పడటంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రాగా పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో ఈనెల 6వ తేదీన ఆస్పత్రిలో చేర్పించగా మంగళవారం ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో ఆమె ముక్కుకు ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. అయితే, అంత వరకు బాగానే ఉన్న వెంకటలక్ష్మి మృతి చెందినట్లు తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వీరి స్వగ్రామమైన పుట్టకోటతో పాటు మృతురాలి స్వగ్రామమైన తిరుమలాయపాలెం నుండి పెద్దసంఖ్యలో బంధువులు చేరుకోగా, న్యూడెమెక్రసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన మృతురాలి బంధువులు, వివిధ పార్టీల నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుడు సరిగా పట్టించుకోలేదని, మత్తుమందు ఎక్కువగా ఇవ్వడం వల్లే వెంకటలక్ష్మి మృతి చెందిందని ఆరోపించారు. ఆందోళన ఉధృతం కావటంతో వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ల సిబ్బంది భారీగా మొహరించారు. అంతే కాకుండా ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు చేరుకుని మృతురాలి బంధువులకు నచ్చచెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నారు. చివరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ బి.శ్రీనివాసరావు, ఏసీపీ ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు వెంకటలక్ష్మి బంధువులతో చర్చించి కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడమే కాక ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాత్రి ఆందోళన విరమించారు. -
ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయిన తల్లిదండ్రులు
-
ఖమ్మం: ఆడబిడ్డ పుట్టిందని.. అమానుషం!
సాక్షి, ఖమ్మం: తల్లి పొత్తిళ్లకు దూరమైన ఆ పసికందు.. పాపం అనాథలా ఏడుస్తూ ఊయలలో కనిపించింది. అది చూసి అంతా అయ్యో బిడ్డా అనుకుంటున్నారు. నగర కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది చైల్డ్‌కేర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కర్కశకంగా వ్యవహరించిన తల్లిదండ్రుల తీరును తిట్టిపోస్తున్నారు ఆ దృశ్యం చూసినవాళ్లు. బిడ్డలను వద్దనుకునే తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేసిన ‘ఊయల’లో ఈ చిన్నారిని వదిలేసి వెళ్లిపోయారు వాళ్లు. ఇలా వదిలేసిన తల్లిదండ్రుల కోసం సమాచారం సేకరించరు. ఖమ్మం శిశుగృహలో ఆ బిడ్డలను పెంచుతారు. ఎవరైనా ముందుకొస్తే దత్తతకు ఇస్తారు కూడా. -
ఏ తండ్రికి ఈ కష్టం రావొద్దు.. బైక్‌పై కూతురి మృతదేహంతో..!
సాక్షి, ఖమ్మం: చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందింది. స్వగ్రామం తరలించేందుకు ఆసుపత్రి అంబులెన్స్ లేదు. ప్రైవేటు వాహనాల్లో తరలించేందుకు ఆర్థిక స్తోమత లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె తండ్రి.. గుండెలనిండా దుఃఖాన్ని నింపుకొని బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాడు. ఈ హృదయవిదారక సంఘటన ఖమ్మం జిల్లాలోని ఏకనూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. కొత్త మేడేపల్లి గ్రామంలోని గిరిజన వర్గానికి చెందిన వెట్టి మల్లయ్య కూతురు వెట్టి సుక్కి(3) కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఏకనూరు ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లా మాతా, శిశు సంక్షేమ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పాప మృతి చెందింది. అయితే, ఆమె మృతదేహాన్ని 65 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామం కొత్త మేడేపల్లికి తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులేక ద్విచక్రవాహనంపై తరలించాడు ఆమె తండ్రి వెట్టి మల్ల. ఆసుపత్రి అంబులెన్స్ ఇవ్వనన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి: ధనబలం, అంగబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: పాల్వాయి స్రవంతి -
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు
-
డెంగ్యూ తీవ్రత అంతగా లేదు : ఈటల
సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత అంతగా లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 99 శాతం జ్వరాలు వైరల్ ఫీవర్లు మాత్రమేనని చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని పలు వార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. 400 పడకల ఆస్పత్రిలో రోజుకు 675 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైరల్ ఫీవర్ల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పరిస్థితిలో మరో 150 పడకల ఏర్పాటు చేస్తున్నట్టు వ్లెడించారు. ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రుల్లో మాదిరిగా త్వరలో ఖమ్మం హాస్పిటల్లో కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం ఆస్పత్రి ఖ్యాతిని పెంచేలా.. సకల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. -
ముచ్చటగా మూడేళ్లకు..!
సాక్షి, ఖమ్మం: ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించక మూడేళ్లు కావొస్తోంది. దీంతో కోట్లాది రూపాయల నిధులున్నా వినియోగించుకోలేక.. అధికారులు సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టక.. పరిస్థితి అధ్వానంగా తయారైంది. గతంలో ఆమోదించిన ప్రతిపాదనలను కూడా పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వాస్తవానికి ఆస్పత్రి పనితీరు, సౌకర్యాల కల్పనకు విధిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి, అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎస్) సమావేశం గురువారం నిర్వ హించనున్నారు. హెచ్‌డీఎస్ చైర్మన్‌గా జెడ్పీ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆస్పత్రిలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశానికి చైర్మన్ లింగాల కమల్‌రాజ్ హాజరుకానున్నారు. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు పెద్దాస్పత్రి అభివృద్ధి కొరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఆస్పత్రి అభివృద్ధి కోసం చేపట్టే అడ్వైజరీ కమిటీ సమావేశం సుమారు మూడేళ్లుగా నిర్వహించకపోవడంతో ప్రధాన ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. 2016, అక్టోబర్ 28న అప్పటి జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత దాని ఊసెత్తలేదు. దీంతో ఇక్కడ సౌకర్యాల కల్పన, మెరుగైన వైద్య సేవలు కరువయ్యాయి. ఆస్పత్రి పనితీరు, సౌకర్యాల కల్పనకు విధిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి, అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆస్పత్రిలో అవసరమైన చర్యలు తీసుకోవడం, నిధుల సమీకరణ, వ్యయం, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది పనితీరు, కొరత, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి. అలాగే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎజెండాను రూపొందించి.. అందులో ప్రతిపాదించిన అంశాలకు సంబంధించి సభ్యుల నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంది. కానీ.. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అడ్వైజరీ సమావేశం ఊసే లేకపోవడంతో రోగులకు అందాల్సిన వైద్య సేవలు, సౌకర్యాలు అందకుండా పోతున్నాయి. దీంతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. గట్టెక్కని తీర్మానాలు.. గత అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించిన పనులు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అప్పడు 38 తీర్మానాలను ప్రవేశపెట్టి.. వెంటనే అమలు చేయాలని తీర్మానించారు. అయితే మూడేళ్లు పూర్తవుతున్నా ఏ ఒక్క తీర్మానం పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి కుంటుపడింది. ఆస్పత్రిలోని బెడ్లు వచ్చే రోగులకు ఏమాత్రం సరిపోవట్లేదని, ఆస్పత్రి స్థాయిని 500 బెడ్లకు పెంచాలని తీర్మానంలో కోరారు. అయితే 150 పడకలతో మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఆ తర్వాత అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆస్పత్రి స్థాయి 400 పడకలకు చేరింది. అయితే 500 పడకల స్థాయి మాత్రం మూడేళ్లు గడిచినా తీరలేదు. రూ.కోట్ల వ్యయంతో 100 పడకల ట్రామా కేర్ భవనాన్ని నిర్మించినా.. అందుబాటులోకి మాత్రం తీసుకురావట్లేదు. అది ప్రారంభిస్తే ఆస్పత్రి స్థాయి 500 పడకలకు చేరుకుంటుంది. కానీ.. భవనం పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రారంభించేందుకు మాత్రం ఎవరూ చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే స్పెషలిస్ట్ డాక్టర్లను భర్తీ చేయాలని, ఎండోస్కోపీ, లాప్రోస్కోప్, ఈఎన్టీ మైక్రోస్కోప్ తదితర పరికరాలు కొనుగోలు చేయాలని, రెండు అంబులెన్స్‌లు కావాలని, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించాలని, అంతర్గత రోడ్ల నిర్మాణం, విద్యుత్ కేవీ సామర్థ్యాన్ని పెంచాలనే తదితర తీర్మానాలు అమోదించారు. కానీ.. వాటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు పూర్తి చేయలేదు. పెద్దాస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జనరల్ ఫిజీషియన్, రేడియాలజిస్టు, డెంటల్, మత్తు డాక్టర్ల కొరత ఉంది. అలాగే ఏఎన్ఎం, నర్సుల కొరత కూడా ఉంది. అంతేకాక ధర్నాచౌక్ వల్ల ఆస్పత్రికి వచ్చే రోగులతోపాటు సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీ స్కాన్ లేక ఇబ్బంది.. పెద్దాస్పత్రిలో గతంలో రూ.కోటి వ్యయంతో సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు. అయితే గత ఏడాది అది పాడైపోయి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల్లో సిటీ స్కానింగ్ అవసరమున్న వారు బయటకు వెళ్లి డయాగ్నస్టిక్ సెంటర్లలో స్కానింగ్ తీయించుకోవాల్సి వస్తోంది. ఉచితంగా అందాల్సిన స్కానింగ్ సేవలను బయట వేలకు వేలు వెచ్చించి పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీ స్కాన్ పాడైపోయి సంవత్సరం దాటినా దానిని అందుబాటులోకి తేవాలని ఎవరూ ప్రయత్నించకపోవడం శోచనీయం. హెచ్‌డీఎస్ సమావేశంలోనైనా నిర్ణయం తీసుకొని అందుబాటులోకి తేవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. నిధులున్నా.. పెద్దాస్పత్రికి సంబంధించి హెచ్‌డీఎస్ నిధులు రూ.కోట్లలో మూలుగుతున్నా వాటిని వెచ్చించలేకపోతున్నారు. మూడు నెలలకు ఒకసారి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి.. ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలను కల్పించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధి కుంటుపడుతోంది. ఇప్పటికైనా అభివృద్ధి కమిటీలో పలు సమస్యలపై తీర్మానాలు ఆమోదించి.. వెంటనే పనులు ప్రారంభించాలని పలువురు రోగులు డిమాండ్ చేస్తున్నారు. -
పెద్దాస్పత్రిని సందర్శించిన ఢిల్లీ బృందం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్‌కి చెందిన ఢిల్లీ బృందం సోమవారం సందర్శించింది. డాక్టర్ టన్ను నాతోగి, డాక్టర్ వినోద్, సందీప్‌షా ఆధ్వర్యంలో బృందం సభ్యులు ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. తొలుత మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి.. మెటర్నిటీ, ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీ, లేబర్ రూం, ఓపీ సేవలను పరిశీలించారు. అనంతరం పాత ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఓపీలను పరిశీలించి.. పనితీరును పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవల పట్ల బృందం సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. బృందం సభ్యులు 18 విభాగాలను పరిశీలించాల్సి ఉండగా.. తొలిరోజు 9 విభాగాల పరిశీలన పూర్తయింది. రెండు బృందాలు రాగా.. ఒక బృందం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని, మరో బృందం భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించింది. మూడు రోజుల పరిశీలన అనంతరం నివేదిక తయారు చేసి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్‌కు నివేదిస్తారు. పరిశీలనలో రాష్ట్ర బృందం సభ్యులు, ఉమ్మడి జిల్లాల నోడల్ ఆఫీసర్ అశోక్‌కుమార్, ఎన్హెచ్ఎం స్టేట్ కోఆర్డినేటర్ నిరంజన్, రాంబాబునాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మదన్‌సింగ్, ఆర్ఎంఓ శోభాదేవి, బి.వెంకటేశ్వర్లు, బి.శ్రీనివాసరావు, కృప ఉషశ్రీ, బాలు, నాగేశ్వరరావు, రామ్మూర్తి, ఆర్వీఎస్ సాగర్, నయీమ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో ఎన్‌క్వాస్ బృందం పరిశీలన భద్రాచలంఅర్బన్: పట్టణ శాంతినగర్ కాలనీలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సోమవారం ఉదయం జాతీయ నాణ్యత ప్రమాణాలును ధృవీకరించే (ఎన్‌క్వాస్) అధికారుల బృందం పర్యటించింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ బృందంలో మనోరంజన్ మహాపాత్ర, ఎంఎం.లీసమ్మ, కొచ్చా నవీన్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. మూడు రోజలు పాటు ఆస్పత్రిలోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే పారిశుద్ధ్య విషయంలో, రోగులకు వైద్య సేవలు అందించడంలో మంచి పేరు సొంతం చేసుకున్న ఈ ఆసుపత్రికి ఎన్‌క్వాస్ గుర్తింపు లభిస్తే దేశంలోనే ఏజెన్సీ ప్రాంతంలో గుర్తింపు పొందిన ఆసుపత్రిగా పేరు అందుకుంటుంది. ఎన్‌క్వాస్ గుర్తింపు వల్ల వచ్చే ప్రోత్సాహంతో ఏజెన్సీ ప్రాంతంలోని ఈ ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందకు వీలు కలుగుతుంది. ఈ బృందంతో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంవీ కోటిరెడ్డి, ఆర్ఎంఓ చావా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రిలో గర్భిణి మృతి
ఖమ్మంవైద్యవిభాగం : ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రధానాసుపత్రిలో ఆదివారం గర్భిణి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఖమ్మం నగర శివారులోని కైకొండాయిగూడేనికి చెందిన నకిరికంటి కీర్తి(23), నిండు గర్భిణి. ఆమె భర్త సురేష్, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కీర్తి గర్భవతయినప్పటి నుంచి జిల్లా కేంద్ర ప్రధానాసుపత్రిలోనే చూపించుకుంటోంది. డాక్టర్లు ఆమెకు జూన్ 12న డెలివరీ డేట్ ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో ఆమె ఆకస్మకంగా అస్వస్థురాలైంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండడం, దగ్గు, కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబీకులు, బంధువులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు డ్యూటీ డాక్టర్ అత్యవసర చికిత్స అందించారు. ఈసీజీ చేయటంతోపాటు ఇంజక్షన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కీర్తి నోట్లో నుంచి నురగ వచ్చింది. కొద్దిసేపటిలోనే (5.25 గంటల సమయంలో) మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యపు వైద్యం కారణంగానే కీర్తి మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రి క్యాజువాల్టీలో ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టూటౌన్ పోలీసులు వచ్చారు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఆ తరువాత, మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా అక్కడ (మార్చురీ ఎదుట) ఆమె ఆందోళనకారులు అడ్డగించారు. అక్కడి నుంచి మృతదేహంతో కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. వారికి పోలీసులు నచ్చచెప్పి శాంతింపచేశారు. వైద్యుల తప్పు లేదు దీనిపై ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ టి.మదన్సింగ్ను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘ఆ గర్భిణి మృతి విషయంలో మా తప్పు ఎంతమాత్రం లేదు. బీపీ ఎక్కువై, గుండెపోటు రావటంతో మృతి చెందింది. ప్రతి నెల ఆమెను మా డాక్టర్లు పరీక్షిస్తున్నారు. ఆమెకు బ్లడ్ కూడా తక్కువగా ఉంది. దీనిని ఆమె భర్తకు కూడా చెప్పాం. వారు ఆమెను ఇక్కడకు తీసుకొచ్చిన గంటలోనే పరిస్థితి విషమించి మృతిచెందింది. పేషంట్‌ను రక్షించేందుకు డ్యూటీ డాక్టర్ ఇంజక్షన్ ఇస్తే... దాని కారణంగానే మృతిచెందిందని అనడం సమంజసం కాదు. సీరియస్ కండీషన్‌తో వచ్చే పేషంట్లను బతికించేందుకే ప్రయత్నిస్తాం’’ అన్నారు. -
రూ.5 వేలకు ఆడశిశువు అమ్మకం!
- తల్లి యాచకురాలు.. - ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో కలకలం ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఓ ఆడశిశువును విక్రయించిన ఘటన కలకలం సృష్టించింది. ఖమ్మం నగరంలోని రంగనాయకులగుట్ట ప్రాంతానికి చెందిన చామల సమ్మక్క శనివారం సాయంత్రం ఈ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమెకు అప్పటికే ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వికలాంగురాలైన ఈమె యాచక వృత్తితో జీవిస్తోంది. భర్త భగవాన్ రిక్షా కార్మికుడు. దీంతో పుట్టిన ఆడపిల్లను వది లించుకోవాలనుకొని ఆస్పత్రి స్వీపర్ జె.జ్యోతిని సంప్రదించి అమ్మిపెట్టాలని ప్రాధేయ పడింది. ఈమె ద్వారా కొత్త గూడెం పాలకేంద్రం ప్రాంతానికి చెందిన రాచర్ల భారతమ్మ, ఆమె కోడలు వెంకట రమణ ఆదివారం ఉదయం ఆస్పత్రికి వచ్చి సమ్మక్కకు రూ.5 వేలు ఇచ్చి శిశువును తమ వెంట తీసుకెళ్లారు. సెక్యూరిటీ గార్డు ద్వారా వెలుగులోకి.. సమ్మక్క తన రెండేళ్ల కూతురు లక్ష్మిని ఎత్తు కొని వెళ్తుండగా హాస్పిటల్ ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీగార్డు నాగేశ్వరరావు అడ్డ గించి విచారించగా అసలు విషయం బయటపడింది. ఆడపిల్ల అమ్మకం సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ రాజి రెడ్డి ఆస్పత్రికి చేరుకొని స్వీపర్ జ్యోతిని అదుపు లోకి తీసుకొని విచారించారు. కొనుగోలు చేసిన వారికి ఈమె ద్వారా ఫోను చేయిం చారు. అప్పటికే తల్లాడ వరకు బస్సులో వెళ్లిన అత్తాకోడళ్లు వెనుతిరిగి వచ్చి శిశువును అప్పగించగా తల్లి ఒడికి చేరింది. యాచకురాలైన తల్లితో ఐసీడీఎస్ అధికారులు, సామాజిక వేత్త అన్నం శ్రీని వాసరావు మాట్లాడి ఆరుగురు సంతానా న్ని బాలల సదన్‌కు తరలించాలని సమ్మక్కను కోరగా అంగీకరించకపోవడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. -
మృత్యుంజయుడు
♦ పూడిక తీస్తుండగా కూలిన బావి ♦ జేసీబీ సాయంతో సమాంతరంగా బావి తవ్వకం ♦ సురక్షితంగా బయటపడిన వైనం చింతకాని: ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పూడిక తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ఏడుగంటలపాటు బావిలో కూరుకుపోయి మృత్యువు అంచులదాకా వెళ్లి సజీవంగా బయటపడ్డాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడుకు చెందిన టేకుమట్ల సైదులు శనివారం పూడిక తీయడం కోసమని తన ఇంట్లో ఉన్న బావిలో ఇద్దరు కూలీలతో పాటు దిగాడు. పూడిక తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా బావి చుట్టూ ఉన్న భూమి కూలి మట్టి సైదులుపై పడింది. ఇదే సమయంలో కూలీలిద్దరూ తప్పుకున్నారు. మట్టిపైన రాయిపడి ఆపైన మళ్లీ మట్టి పడింది. వెంటనే స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూటీం వచ్చి.. సైదులుకు ఆక్సిజన్ అందుతున్నట్లు గుర్తించింది. వెంటనే జేసీబీతో బావికి సమాంతరంగా మరో బావి తవ్వారు. సుమారు ఏడు గంటల తర్వాత సైదులను బావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.