రూ.5 వేలకు ఆడశిశువు అమ్మకం!
Published Mon, Jul 10 2017 2:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM
- తల్లి యాచకురాలు..
- ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో కలకలం
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఓ ఆడశిశువును విక్రయించిన ఘటన కలకలం సృష్టించింది. ఖమ్మం నగరంలోని రంగనాయకులగుట్ట ప్రాంతానికి చెందిన చామల సమ్మక్క శనివారం సాయంత్రం ఈ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమెకు అప్పటికే ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వికలాంగురాలైన ఈమె యాచక వృత్తితో జీవిస్తోంది. భర్త భగవాన్ రిక్షా కార్మికుడు. దీంతో పుట్టిన ఆడపిల్లను వది లించుకోవాలనుకొని ఆస్పత్రి స్వీపర్ జె.జ్యోతిని సంప్రదించి అమ్మిపెట్టాలని ప్రాధేయ పడింది. ఈమె ద్వారా కొత్త గూడెం పాలకేంద్రం ప్రాంతానికి చెందిన రాచర్ల భారతమ్మ, ఆమె కోడలు వెంకట రమణ ఆదివారం ఉదయం ఆస్పత్రికి వచ్చి సమ్మక్కకు రూ.5 వేలు ఇచ్చి శిశువును తమ వెంట తీసుకెళ్లారు.
సెక్యూరిటీ గార్డు ద్వారా వెలుగులోకి..
సమ్మక్క తన రెండేళ్ల కూతురు లక్ష్మిని ఎత్తు కొని వెళ్తుండగా హాస్పిటల్ ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీగార్డు నాగేశ్వరరావు అడ్డ గించి విచారించగా అసలు విషయం బయటపడింది. ఆడపిల్ల అమ్మకం సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ రాజి రెడ్డి ఆస్పత్రికి చేరుకొని స్వీపర్ జ్యోతిని అదుపు లోకి తీసుకొని విచారించారు. కొనుగోలు చేసిన వారికి ఈమె ద్వారా ఫోను చేయిం చారు. అప్పటికే తల్లాడ వరకు బస్సులో వెళ్లిన అత్తాకోడళ్లు వెనుతిరిగి వచ్చి శిశువును అప్పగించగా తల్లి ఒడికి చేరింది. యాచకురాలైన తల్లితో ఐసీడీఎస్ అధికారులు, సామాజిక వేత్త అన్నం శ్రీని వాసరావు మాట్లాడి ఆరుగురు సంతానా న్ని బాలల సదన్‌కు తరలించాలని సమ్మక్కను కోరగా అంగీకరించకపోవడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
Advertisement