హైదరాబాద్‌లో మరో కొత్త ముఠా | Police Arrest Babies Selling Gang In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో కొత్త ముఠా

Published Tue, Feb 4 2020 9:28 AM | Last Updated on Tue, Feb 4 2020 9:35 AM

Police Arrest Babies Selling Gang In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో మరో కొత్త ముఠా వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన శిశువులను విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వీరు ఒక్కో శిశువును రూ. 10 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు పలు సంతానసాఫల్య కేంద్రాలు సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలు లేనివారే లక్ష్యంగా ఈ ముఠా సభ్యులు దందా సాగిస్తున్నారు. పిల్లలను అమ్మే తల్లికి మాత్రం కేవలం రూ. 70 వేల ఇచ్చి మోసం చేస్తున్నారు.

ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మందిని పోలీసులు గుర్తించారు. వీరు ఇప్పటివరకు 14 మంది శిశువులను అమ్మినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే శిశు విక్రయాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement