సాక్షి, మహబూబ్‌నగర్ / నాగర్‌కర్నూల్: గ్రామ కంఠం భూమికి సంబంధించిన వివాదం చినికి చినికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో మూడున్నర ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. దానిలో ప్రకృతి వనం నిర్మించాలని గ్రామ పంచాయతీ తీర్మానించింది. అయితే ఆ భూమి గతంలో రాజులకు చెందినదిగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూమి గ్రామ కంఠంలో ఉంది. అయితే కొంతమంది తాము రాజుల వారసులమని ప్రచారం చేసుకుంటూ ఆ భూమి తమకే చెందుతుందంటున్నారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన మరికొందరు ఆ భూమిలో గుడిసెలు వేసుకునేందుకు వచ్చారు.