భూ వివాదంలో జోక్యం చేసుకున్న ఆఫీసర్
బల్దియా ఉన్నతాధికారితో కలిసి పథక రచన
సాక్షి, సిటీబ్యూరో: పోలీసులు.. సాధారణంగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్నీ నిర్లక్ష్యం చేస్తారనే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. న్యాయస్థానాలతో పాటు ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపైనే పలువురిపై చర్యలు తీసుకుంటూ ఉంటాయి. కొందరు ఖాకీలకు ఇదంతా డ్యూటీల దగ్గర మాత్రమే... ‘వాటా’ల వద్దకు వచ్చేసరికి మాత్రం తమవి కాని విధుల్నీ నిర్వర్తించేస్తుంటారు. భూ కబ్జాదారులతో కుమ్మక్కై ఇతర శాఖల అధికారులతో కలిసి ‘ప్లాన్’ చేస్తూ భూ యజమానుల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఓ వ్యవహారమే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతోంది. హైటెక్ జోన్ కేంద్రంగా ఓ ఉన్నతాధికారి నిర్వర్తిస్తున్న ‘అదనపు’ విధులకు బల్దియా అధికారి సైతం సహకరిస్తుండటం గమనార్హం.
భూ విలువలు పెరగడంతో కుట్రలు..
నగర వ్యాప్తంగా భూములు విలువలు గణనీయంగా పెరిగిపోవడం కొత్త వివాదాలకు కారణం అవుతోంది. ఖాళీ జాగాలకు కొత్త యజమానులు పుట్టుకువస్తున్నారు. మదీనాగూడ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం కూడా అలాంటిదే. నగరానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతంలోని రెండు సర్వే నంబర్లలో ఉన్న స్థలం ఖరీదు చేశారు. మొత్తం వెయ్యి చదరపు గజాలకు పైగా ఉన్న ఈ స్థలంలో చాలా భాగం విక్రయించారు. మిగిలిన 300 గజాల్లో నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యారు. దీనిపై కన్నేసిన పాత యజమాని సంబం«దీకులు కొందరు వివాదం చేయడం మొదలెట్టారు. రేటు ఆకాశాన్ని అంటడంతో ఏమాత్రం అవకాశం చిక్కినా చట్టపరంగా ఆ భూమిని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు.
కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చినా..
ఈ స్థలంపై యాజమాన్యం హక్కు కోసం, ఆపై టెనెంట్ కేసుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానికోసం కొన్ని నోటరీ పత్రాలను సమరి్పంచారు. ఖాళీ స్థలాలకు కేవలం ప్లాట్ నంబర్లు మాత్రమే ఉంటాయి. వివాదం చేయాలని భావించిన వాళ్లు ఏకంగా డోర్ నంబర్ వేసుకుని మరీ పత్రాలు రూపొందించారు. దీంతో న్యాయస్థానం వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ భూమి ఎవరి పేరుతో ఉందో ఆ మహిళకే కోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ సైతం ఇచి్చంది. దీని ఆధారంగా జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్న భూ యజమాని నిర్మాణం కోసం అనుమతి కూడా తెచ్చుకున్నారు. ఈమెను ఇబ్బంది పెట్టడం ద్వారా లబి్ధ పొందాలని ప్రయతి్నంచిన కబ్జారాయుళ్లు దీనికోసం కొత్త పథకం వేశారు.
ఒత్తిడికి యత్నించి..
సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోని ఓ కీలక జోన్‌లో పని చేస్తున్న ఉన్నతాధికారిని సంప్రదించాడు. ఇద్దరి మధ్యా జరిగిన ‘ఒప్పందం’తో రంగంలోకి దిగిన అధికారి తొలుత పోలీసులను వాడి భూ యజమానికిపై ఒత్తిడికి ప్రయతి్నంచారు. ఇది ఫలితం ఇవ్వకపోవడంతో కథ మార్చారు. బల్దియాకు చెందని మరో ఉన్నతాధికారితో కలిసి ‘ప్లాన్’ చేశాడు. వీలైనంత త్వరగా ఆ పోలీసు, బల్దియా అధికారులకు కలిసి సెటిల్ చేసుకుంటే ఉత్తమం అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో విసిగిపోయిన ఆ యజమాని న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment