రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులు, ఉద్రిక్తత | Two groups clash over land dispute at ravikampadu | Sakshi
Sakshi News home page

రణరంగంగా మారిన రావికంపాడు

Published Mon, Apr 22 2019 2:33 PM | Last Updated on Mon, Apr 22 2019 4:54 PM

Two groups clash over land dispute at ravikampadu - Sakshi

సాక్షి, చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడులో భూ వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మూడెకరాల భూమికి సంబంధించి ఈ వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు గ్రామంలోనే మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీసులు మరోవైపు ఈ భూమి వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులను వివరాలు కోరారు. అయితే రీ సర్వే నిర్వహించిన అనంతరం తాము సమగ్ర వివరాలు వెల్లడిస్తామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కాసేపట్లో....

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement