
హైదరాబాద్: భూవివాదంలో న్యాయం జరగక పోవడంతో ఆత్మహత్యకు యత్నించిన బాధితు రాలు వెంకటవ్వ(65) ఆదివారం మృతి చెం దింది. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్లకు చెందిన కేతిరెడ్డి బాల్‌రెడ్డి, వెంకటవ్వ(65) దంపతులు హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఈ నెల 17న పురుగుల మందు తాగిన విషయం విదితమే. అప్పటి నుంచి దంపతులు ఇక్కడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
వెంకటవ్వ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. బాల్‌రెడ్డి కోలుకుంటున్నారు. కాగా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వెంకట్‌రెడ్డితోపాటు రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లేపల్లి యాదిరెడ్డి, భారతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తేల సృజన బాల్‌రెడ్డిని పరామర్శించారు.
అనంతరం వెంకటవ్వ మృతదేహాన్ని సందర్శించారు. బాల్‌రెడ్డి మూడుసార్లు సర్పంచ్‌గా, ఒకసారి సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేశారని చాడ చెప్పారు. వారికి అయిన వైద్యఖర్చులను ప్రభుత్వమే భరించాలని, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment