
గాయపడిన శ్రీలత
సాక్షి, కరీమాబాద్: నగరంలోని 9వ డివిజన్ ఖిలావరంగల్ మద్యకోటలో సోమవారం భూ వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాల మద్య గొడవ జరగడంతో మహిళకు గాయాలయ్యాయి. మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం. ఖిలావరంగల్ మద్యకోటలోని వాకింగ్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఎకరం స్థలం తమదంటే తమదని మాజీ కార్పొరేటర్ కొప్పుల శ్రీనివాస్, ముప్ప శ్రీలత గొడవలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో శ్రీలత ఆమె భర్త సోమవారం వివాదాస్పద స్థలంలోని పంటపొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొప్పుల శ్రీనివాస్‌కు ముప్ప శ్రీలతలకు మద్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాస్ శ్రీలతను కర్రతో కొట్టడంతో తలకు గాయమైంది. ఈ గొడవలో మరో వ్యక్తికి కూడా గాయమైంది. తీవ్రంగా గాయపడిన శ్రీలతతో పాటు ఆమె సంబందీకులు మిల్స్‌కాలనీ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం గాయాలైన శ్రీలతను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించి.. దాడికి పాల్ప డిన కొప్పుల శ్రీనివాస్‌పై, అతనితో ఉన్న కొప్పుల మొగిలీపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసును ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు.