ముంబై: మహారాష్ట్రలో సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన చెందిన నేతపై బీజేపీ చెందిన ఎమ్మెల్యేపై జరిపిన కాల్పులు శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. భూవివాదం నేపథ్యంలో షిండే వర్గం శివసేన ముంబై చీఫ్ మహేష్ గైక్వాడ్, మరోనేత రాహుల్ పాటిల్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ కాల్పలు జరిపారు. ఈ ఘటన హిల్ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వార్లీ గ్రామంలోని భూవివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గణపతి గైక్వాడ్ కొడుకు వైభవ్ గైక్వాడ్ పోలీసు స్టేషణ్‌కు తన అనుచరులను తీసుకొని వచ్చారు. అదే సమయంలో మహేష్ గైక్వాడ్ సైతం తన కార్యకర్తలను తీసుకొని పోలీసు స్టేషన్‌కు వచ్చారు. కొంత సమయానికి గణపతి కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. సీనియర్ ఇన్స్‌పెక్టర్ అనిల్ జగ్‌తాప్.. ఇద్దరు నేతలను కూర్చోబెట్టి మాట్లాడుతున్న క్రమంలో స్టేషన్ వెలుపల ఇరు వర్గాల అనుచరులు ఆందోళకు దిగారు. దీంతో వారిని కంట్రోల్ చేయడానికి ఇన్స్‌పెక్టర్ అనిల్ జగ్‌తాప్ బయటకు వెళ్లారు.
ఆ సమయంలో గణపతి గైక్వాడ్ .. మహేష్ గైక్వాడ్, మరో నేత రాహుల్ పాటిల్‌పై తుపాకితో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో మహేష్ గైక్వాడ్, రాహుల్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపే క్రమంలో గణపతి గైక్వాడ్ చేతికి గాయం అయింది. గాయపడిన మహేష్ గైక్వాడ్, రాహుల్‌ను థానేలోని ఆస్పత్రికి తరలించారు. మహేష్ గైక్వాడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైవ్వాడ్‌తో పాటు మరో ఇద్దని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మహేష్ గైక్వాడ్.. కళ్యాణ్ లోక్‌సభ ఎంపీ, ఏక్ నాథ్ షిండే కుమారు డా. శ్రీకాంత్ షిండే సన్నిహితుడు కాగా.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన గణపతి గైక్వాడ్ చాలా సన్నిహితుడు గమనార్హం. సంకీర్ణ ప్రభుత్వంలోని ఇరుపార్టీల నేతల మధ్య జరిగిన కాల్పుల ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాకు పశ్చాత్తాపం లేదు: గణపతి గైక్వాడ్
ఆత్మరక్షణ కోసమే షిండే వర్గం శివసేన నేతపై కాల్పులు జరిపానని తెలిపారు. తన కొడుకుపై పోలీసు స్టేషన్‌లో మహేష్ గైక్వాడ్, అతని అనుచరులు దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అందుకే వారి నుంచి తన కొడుకును కాపాడే క్రమంలో కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల ఘటనపై తనకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. నిన్న (శుక్రవారం) రోజు పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గణపతి గైక్వాడ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై ఆయనను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
చదవండి: సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష.. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే
Comments
Please login to add a commentAdd a comment