భూ వివాదంలో ఘర్షణ: పోలీసులపై సస్పెన్షన్‌ వేటు | Two People Dead In UP Panchayat Meeting Violence Three Cops Suspended | Sakshi
Sakshi News home page

భూ వివాదంలో ఇద్దరు మృతి

Published Sun, Aug 16 2020 5:41 PM | Last Updated on Sun, Aug 16 2020 5:56 PM

Two People Dead In UP Panchayat Meeting Violence Three Cops Suspended - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. భూ వివాదం కారణంగా  రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన ప్రతాప్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం ఉదయం రెండు వర్గాల మధ్య నెలకొన్న భూ వివాదం పరిష్కరించడానికి గ్రామ పంచాయతి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. దీంతో రెండు వర్గాలకు చెందినవారు ఘర్షణకి దిగి పరస్పరం దాడికి పాల్పడ్డారు. (సైకో యువకుడు: మనిషి పుర్రెను..)

ఒక వర్గానికి చెందిన తండ్రి దయాశంకర్ మిశ్రా ఆయన కుమారుడు ఆనంద్ మిశ్రా తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ హింసకు సంబంధించి మరో వర్గానికి చెందిన రాజేష్ కుమార్ మిశ్రా అతని కుమారుడిని  పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు. రెండు వర్గాల మధ్య జరిగిన  ఈ ఘర్షణ నివారించలేకపోయిన  ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. (మద్యం అక్రమ రవాణా: బీజేపీ నేత అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement