మద్యం తాగించి.. గొడ్డలితో నరికి | man Brutal murder in peddamul | Sakshi
Sakshi News home page

మద్యం తాగించి.. గొడ్డలితో నరికి

Published Fri, Apr 29 2016 3:09 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

మద్యం తాగించి.. గొడ్డలితో నరికి - Sakshi

మద్యం తాగించి.. గొడ్డలితో నరికి

యువకుడి దారుణ హత్య
భూతగాదాలే కారణం అంటున్న కుటుంబీకులు
పోలీసుల అదుపులో నిందితులు
పెద్దేముల్ మండలం రుద్రారంలో ఘటన

 పెద్దేముల్: భూతగాదాల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం తాగించి గొడ్డలితో చంపేశారు. ఈ సంఘటన గురువారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో  చోటుచేసుకుంది. పోలీసులు, హతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొలుముల నర్సన్న, చంద్రమ్మ దంపతులకు కొడుకు నర్సింలు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం కుంచారం మండలం భువన్‌పూర్ గ్రామానికి చెందిన ఆంజిలమ్మను నర్సింలు వివాహం చేసుకున్నాడు. అయితే, ఆస్తి విషయంలో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి. నర్సింలుకు పిల్లలు లేరు.

 ఆయన గ్రామంలోనే భార్యతో కలిసి వేరుగా ఉంటున్నాడు. అయితే, ఇంట్లో పిల్లలు లేకపోవడంతో నర్సన్న తన పెద్ద కూతురు కొడుకు గోపాల్‌ను పెంచుకుంటున్నాడు. అయితే, నర్సింలు కూడా తన భార్య అక్క కుమారుడు జగదీశ్వర్(20)ను దత్తత తీసుకున్నాడు. ఆస్తి ఎవరికి చెందాలనే విషయమై తండ్రీకొడుకులు నర్సన్న, నర్సింలు గొడవపడుతున్నారు. ఈ విషయమై రెండు రోజుల క్రితం పంచాయతీ జరిగింది. గోపాల్‌కు డబ్బులు ఇవ్వాలని, జగదీశ్వర్‌కు భూమి ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఎలాగైనా ఆస్తి, డబ్బులు తనే దక్కించుకోవాలని గోపాల్..జగదీశ్వర్(20)ను అంతం చేయటానికి పథకం పన్నాడు.

ఈక్రమంలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కొందరితో కలిసి జగదీశ్వర్‌కు మద్యం తాగించి అనంతరం గొడ్డలితో తలపై నరికి చంపేసి మృతదేహాన్ని నర్సింలు ఇంటిముందు పడేశాడని నర్సింలు కుటుంబీకులు ఆరోపించారు. గురువారం ఉదయం మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాంరూరు రూరల్ సీఐ సైదిరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాాలు సేకరించారు. క్లూస్ టీమ్, పాటు డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. అయితే, సుమారు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement