
అన్నను నరికి చంపిన తమ్ముడు
అరకు: పొలం గట్టు వద్ద నెలకొన్న చిన్న తగాదాతో విచక్షణ కోల్పోయిన ఓ తమ్ముడు తన అన్ననే నరికి చంపాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా అరకులోయ మండలం మంజగూడలో బుధవారం చోటుచేసుకుంది. పొలం వద్ద వచ్చిన తగాదాతో.. గ్రామానికి చెందిన సామర్థి మదన్ సుందర్(40) అనే వ్యక్తిని.. ఆయన తమ్ముడు జలంధర్(38) పారతో నరికి చంపాడు. ఘటన అనంతరం జలంధర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.