
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2003లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఈ చిత్రంలో భూమిక ప్రధాన పాత్రలో కనిపించగా.. మరో హీరోయిన్‌గా అంకిత నటించింది. సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న అంకిత.. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో ఛాన్సులు కూడా కొట్టేసింది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ధనలక్ష్మీ.. ఐ లవ్ యూ, ప్రేమలో పావని కల్యాణ్ చిత్రాల్లో కనిపించింది.
అంతే కాకుండా నవదీప్ సరసన మనసు మాట వినదు, గోపీచంద్‌తో రారాజు, రవితేజతో ఖతర్నాక్ సినిమాల్లో నటించారు. అయితే ఆ తర్వాత వచ్చిన విజయేంద్రవర్మ మూవీ ఆమెకు కలిసి రాలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత తాను సినిమాలకు ఎందుకు దూరమయ్యానో చెప్పుకొచ్చింది. అంకిత 2009 నుంచి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.
(ఇది చదవండి: సరదాగా చెప్తే.. లావణ్య సీరియస్‌గా తీసుకుంది: అల్లు అరవింద్ )
అంకిత మాట్లాడుతూ.. 'విజయేంద్రవర్మ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ నేను ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ చిత్రం సక్సెస్ అయి ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని.' అని అన్నారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే కెరీర్ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నవదీప్‌తో వివాదం!
అయితే టాలీవుడ్ హీరో నవదీప్‌తో తనకు ఎలాంటి విభేదాల్లేవని అంకిత స్పష్టం చేశారు. నవదీప్ మూవీతో పాటు.. తమిళంలో మరో సినిమా ఓకేసారి చేయడంతో కాస్త ఒత్తిడిగా ఫీలయ్యానని.. ఆ క్రమంలో అసహనానికి గురయ్యాను తప్ప.. ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఆర్తీ అగర్వాల్, ఉదయ్ కిరణ్ తనకు మంచి స్నేహితులని తెలిపారు. వారిద్దరు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.
వ్యాపారవేత్తతో పెళ్లి
అంతే కాకుండా గతేడాది హీరో అల్లు అర్జున్‌ను కలిశానని.. ఎన్టీఆర్‌తో సోషల్ మీడియాలో టచ్‌లో ఉన్నానని తెలిపారు. మంచి అవకాశం వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా.. ముంబయికి చెందిన అంకితకు విశాల్ జగపతి అనే బిజినెస్‌మెన్‌ను 2016లో పెళ్లి చేసుకుని యూఎస్‌లోని న్యూజెర్సీలో అంకిత స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు.
(ఇది చదవండి: 'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా! )
Comments
Please login to add a commentAdd a comment