రస్నాబేబీ పెళ్లి కుదిరింది | rasna baby ankitha marriage fixed with nri | Sakshi
Sakshi News home page

రస్నాబేబీ పెళ్లి కుదిరింది

Published Sat, Nov 7 2015 12:24 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

రస్నాబేబీ పెళ్లి కుదిరింది

రస్నాబేబీ పెళ్లి కుదిరింది

'లాహిరి లాహిరి లాహిరి', 'సింహాద్రి', 'ధనలక్ష్మీ ఐ లవ్ యూ' లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అంకిత. సినిమాల్లో కనిపించటానికి ముందే 'ఐ లవ్ యూ రస్నా' అంటూ అందరి మనసు దోచుకున్న రస్నాబేబి తరువాత హీరోయిన్ గా కూడా తన మార్క్ చూపించింది. అయితే నటిగా కొద్ది రోజులు మాత్రమే మెరిసి మాయమైపోయింది.

సినిమాలకు దూరమైన తరువాత యుఎస్ లో సెటిల్ అయిన అంకిత, సినిమాల మీద ప్రేమతో హాలీవుడ్ స్టూడియోలో ఫిలిం టెక్నాలజీ కోర్స్ చేసింది. అంతేకాదు కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్స్ దగ్గర దర్శకత్వ శాఖలోనూ పనిచేసింది. అయితే ఇంత కాలం మీడియాకు సైతం దూరంగా ఉన్న ఈ భామ మరోసారి వార్తల్లో కనిపించింది.

సోమవారం ఉదయం ముంబైలోని జెవి మారియట్ హోటల్ లో అంకిత నిశ్చితార్థం జరిగింది. న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ విశాల్ జగ్తాప్ ను త్వరలోనే వివాహమాడనుంది అంకిత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement