Simhadri 4K Re-Release Collections Will Donate To Jr NTR Fans, Deets Inside - Sakshi
Sakshi News home page

Simhadri Movie Re-Release: రీరిలీజ్‌ కానున్న సింహాద్రి, కలెక్షన్స్‌ ఏం చేస్తారంటే?

Published Thu, May 18 2023 3:57 PM | Last Updated on Thu, May 18 2023 5:04 PM

Simhadri Collections Will Donate To Jr NTR Fans - Sakshi

రీరిలీజ్‌ విషయంలో యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ రికార్డు క్రియేట్‌ చేశాడు. 20 ఏళ్ల క్రితం వచ్చిన సింహాద్రి సినిమాకు వెయ్యి షోస్‌ ఉండటం, దానికి గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగడమంటే మామూలు విషయం కాదు. తారక్‌ బర్త్‌డే సందర్భంగా తన ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌ మూవీ సింహాద్రి మే 20న రీరిలీజ్‌ కాబోతున్న సంగతి తెలిసిందే. 4కే, డాల్బీ అట్మాస్ వర్ష‌న్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఓవ‌ర్‌సీస్‌లోనే 150కి పైగా థియేట‌ర్స్‌లో సింహాద్రి సినిమాను ప్రదర్శించనున్నారు. వ‌ర‌ల్డ్‌లోనే అతి పెద్ద స్క్రీన్ అయిన మెల్‌బోర్న్ ఐమాక్స్ థియేట‌ర్‌లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయట. సింహాద్రి రీరిలీజ్‌ ద్వారా వచ్చిన కలెక్షన్స్‌లోని లాభాలను ఓ మంచి పని కోసం ఉపయోగించాలని మేకర్స్‌ భావిస్తున్నారట. 

పేద‌రికంతో బాధ‌ప‌డుతున్న ఎన్టీఆర్ అభిమానుల‌కు ఈ క‌లెక్ష‌న్స్ పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూట‌ర్స్ సూచించిన అభిమానుల‌కు సాయాన్ని అందించ‌నున్న‌ట్లు టాక్‌ వస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. కాగా ఎస్.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అప్పట్లోనే 30 కోట్లు వసూళు చేసి బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. 2003లో టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రీరిలీజ్‌లోనూ సింహాద్రి మూవీ రికార్టు క్రియేట్‌ చేయడం మరో విశేషం.

చదవండి: సల్మాన్‌ ఖాన్‌ సోదరి ఇంట్లో దొంగతనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement