బ్యూటీ గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందంటే? | Pokiri Movie Lady Villain Sheeva Rana Latest Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Pokiri Actress: గిల్లితే గిల్లించుకోవాలి.. ఆ బ్యూటీ గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే?

Published Wed, Feb 28 2024 3:30 PM | Last Updated on Fri, Sep 20 2024 10:59 AM

Pokiri Movie Villain Side Actress Sheeva Rana Latest Photos Goes Viral - Sakshi

ఇండస్ట్రీలో కొందరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. మెరుపుతీగలా మెరిసి మాయమైపోతుంటారు. ఇక్కడ చెప్పుకునే పోకిరి బ్యూటీ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పోకిరిలో విలన్‌ ప్రకాశ్‌ రాజ్‌ గ్యాంగ్‌లో ఓ రౌడీ అమ్మాయి కూడా ఉంటుంది. ఆవిడే శివ రాణా. పబ్‌ సీన్‌లో ప్రకాశ్‌ రాజ్‌ పక్కనే కూర్చుని బోల్డ్‌ అమ్మాయిగా కనిపిస్తుంది.

గిల్లితే గిల్లించుకోవాలి..
పబ్‌లో జరిగే సన్నివేశంలో ప్రకాశ్‌ రాజ్‌.. శివ రాణాను గిల్లుతాడు. ఆమె అరవడంతో.. 'గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు' అనే డైలాగ్‌ చెప్తాడు. ఈ డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది. కానీ ఆమెకు మాత్రం పెద్ద అవకాశాలు రాలేదు. పోకిరి తర్వాత ధగడ్‌ సాంబ, దేవుడు చేసిన మనుషులు, మెహబూబా.. చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది. కానీ మంచి ఆఫర్స్‌ రాలేదు.

యోగా టీచర్‌గా..
ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో సినిమాల మీద ఆశ పెంచుకోకుండా అప్పుడప్పుడు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో నటిస్తూ అభిమానులను అలరించింది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించే ఈ బ్యూటీ ప్రస్తుతం యోగా టీచర్‌గా పని చేస్తోంది. యోగా టీచర్‌ కావడంతో తన బాడీని ఇప్పటికీ ఫిట్‌గా మెయింటెన్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ పిక్స్‌ షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోందీ బ్యూటీ.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement