డై..లాగి కొడితే....
సినిమా : పోకిరి
దర్శక-రచయిత: పూరి జగన్నాథ్
అలీ భాయ్ (ప్రకాశ్‌రాజ్) పెద్ద మాఫియా డాన్. తన అనుచరులను పెట్టుకుని హైదరాబాద్‌లో చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు. సిటీ పోలీస్ కమిషనర్ సయ్యద్ మొహమ్మద్ పాషా (షాయాజీ షిండే) అలీ భాయ్‌ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. పోలీస్ అయిన కృష్ణ మనోహర్ (మహేశ్‌బాబు) అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా పండు అనే పోకిరీగా తిరుగుతుంటాడు. ఓ సందర్భంలో అలీభాయ్ అనుచరుడు నాయర్‌ను (సుబ్బరాజు) పండు కొడతాడు. దాంతో రౌడీ గ్యాంగ్ పండు కోసం వస్తుంది. ఆ గ్యాంగ్‌లో ఒకడు ‘రేయ్.. ఇక్కడ పండు అంటే ఎవడ్రా? నువ్వా పండు. చెప్పు బే.. కౌన్ పండు’ అంటూ రచ్చ చేస్తాడు. అప్పుడు ‘అన్నయ్యా.. పండుగాడు కావాలా? అంటూ గూబ గుయ్‌మనేలా వాణ్ణి కొట్టి, ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’.నేనే ఏంటి? అంటాడు పండు.
మైండ్ బ్లోయింగ్ డైలాగ్ కదూ.