పోకిరీ వేషం... కుదిరింది రోగం! | young man held for cell phone shooting in kukatpally | Sakshi
Sakshi News home page

పోకిరీ వేషం... కుదిరింది రోగం!

Published Mon, Jun 22 2015 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

పోకిరీ వేషం... కుదిరింది రోగం!

పోకిరీ వేషం... కుదిరింది రోగం!

హైదరాబాద్: పోకిరీ వేషం వేసిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని జయనగర్ కాలనీలో చోటుచేసుకుంది. యువతి స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ లో చిత్రీకరించిన యువకుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

ఓ అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్థులో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు కరీంనగర్ జిల్లా జగిత్యాల వాసిగా గుర్తించారు. ఉన్నత విద్యావంతుడైన అతడు ఈ విధంగా పోకిరీ వేషాలు వేయడం పొరుగువారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేం పనయ్యా అంటూ అతడికి పలువురు గడ్డి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement