అతిలోక సుందరికి అరుదైన గౌరవం | Sridevi's Wax Statue To be Unveiled at the Iconic Madame Tussauds Museum | Sakshi
Sakshi News home page

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

Published Tue, Sep 3 2019 12:57 PM | Last Updated on Tue, Sep 3 2019 12:57 PM

Sridevi's Wax Statue To be Unveiled at the Iconic Madame Tussauds Museum - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి ఈ ప్రపంచాన్ని విడిచి ఏడాదిన్నర కాలమవుతున్నా అభిమానులు ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చేసిన విభిన్న పాత్రలు, సినిమాల ద్వారా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తాజాగా ఈ దివంగత నటికి మరో అరుదైన గౌరవం దక్కింది.

ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అంతేకాదు శ్రీదేవి మైనపు విగ్రహానికి సంబంధించిన ప్రొమో వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ఆ ప్రోమోలు శ్రీదేవి కళ్లు.. ఆమే భువికి తిరిగొచ్చారా అన్నంత సహజంగా ఉండటంతో పూర్తి విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 4న సింగపూర్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షం ప్రసారం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement