Madame Tussauds wax museum
-
గ్లోబల్ స్టార్ అరుదైన ఘనత.. ఆ దిగ్గజాల పక్కన ఛాన్స్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది. తాజాగా అబుదాబిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు.వచ్చే ఏడాది సమ్మర్లో విగ్రహాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే రామ్‌చరణ్ పెంపుడు శునకం రైమ్ కూడా మైనపు విగ్రహంలో కనిపించనుంది. క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత ఇలా పెట్‌తో ఉన్న వారిలో రెండో వ్యక్తిగా చెర్రీ ఘనత సాధించారు. కాగా.. ఇప్పటికే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కాజోల్, కరణ్ జోహార్ల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి.ఈ అరుదైన గౌరవం దక్కటం పట్ల రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. లెజెండరీ నటుల విగ్రహాల పక్కన ఉండేలా గౌరవం దక్కుతుందని కలలోనూ ఊహించలేదన్నారు. సినిమాపై నాకున్న ప్యాషన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ అవకాశమిచ్చిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులకు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ సినిమా స్టార్స్‌ను మేడమ్ టుస్సాడ్స్‌కు తీసుకురావడం సంతోషంగా ఉందని మ్యూజియం ప్రతినిధులు వెల్లడించారు.Hello Everyone 👋🏻 Iam RAM CHARAN Iam Very Honoured to Joins @MadameTussauds Family!!!!@AlwaysRamCharan Wax Statue to be unveiled at #MadameTussauds this Summer 2025 ⏳🌟😉🤩#GameChanger #RamCharan 🦁👑🔥 pic.twitter.com/dApCKhmUPi— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) October 22, 2024 -
‘నీ యవ్వ తగ్గేదే లే..’.. దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం (ఫొటోలు)
-
దుబాయ్‌లో అల్లు అర్జున్.. ఆ గౌరవం దక్కించుకున్న తొలి హీరోగా గుర్తింపు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్‌లో అడుగుపెట్టారు. తన కుటుంబంతో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నారు. దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన బన్నీ నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత మరో విశేష గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ కుటుంబంతో పాటు దుబాయ్ చేరుకున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకి ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ ఇవి లండన్‌లోని మ్యూజియంలో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ విగ్రహం మాత్రం దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తున్నడం విశేషం. దీంతో సౌత్ ఇండియా తొలి హీరోగా బన్నీ రికార్డ్ సెట్ చేశారు. అంతే కాకుండా దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు హీరో కూడా బన్నీనే కావడం మరో విశేషం. సినిమా, క్రీడలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్ మ్యూజియంలో పొందుపరిచారు. సింగపూర్, లండన్, దుబాయ్.. ఇలా వివిధ చోట్ల ఈ మ్యూజియానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. దుబాయ్‌లోని మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్,షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో మన టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ చేరనున్నారు. -
మేడమ్ తుస్సాడ్స్‌లో...
దుబాయ్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ మైనపు బొమ్మ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి మేడమ్ తుస్సాడ్స్ ప్రతినిధులు అల్లు అర్జున్ కొలతలను తీసుకున్నారు. దాదాపు 200 కొలతలు తీసుకున్నారట. ‘‘ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ బొమ్మను ఏర్పాటు చేయబో తున్నాం. ఈ మైనపు బొమ్మ ఆవిష్కరణ వచ్చే ఏడాది ఉంటుంది’’ అంటూ అల్లు అర్జున్ కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేశారు నిర్వాహకులు. కాగా, దుబాయ్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో తెలుగు నుంచి ప్రదర్శితం కానున్న తొలి మైనపు బొమ్మ అల్లు అర్జున్‌దే కావడం విశేషం. National Award winner; the first Telugu Actor in 69 years to win this award and icon of dance moves, the one and only Allu Arjun is all set to come face to face with his wax twin at Madame Tussauds Dubai later this year. Stay tuned for an event like never before 🎬✨#alluarjun pic.twitter.com/ePHhfvWfru — Madame Tussauds Dubai (@Tussauds_Dubai) October 5, 2023 -
అతిలోక సుందరికి అరుదైన గౌరవం
అతిలోక సుందరి శ్రీదేవి ఈ ప్రపంచాన్ని విడిచి ఏడాదిన్నర కాలమవుతున్నా అభిమానులు ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చేసిన విభిన్న పాత్రలు, సినిమాల ద్వారా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తాజాగా ఈ దివంగత నటికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు శ్రీదేవి మైనపు విగ్రహానికి సంబంధించిన ప్రొమో వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ ప్రోమోలు శ్రీదేవి కళ్లు.. ఆమే భువికి తిరిగొచ్చారా అన్నంత సహజంగా ఉండటంతో పూర్తి విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 4న సింగపూర్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షం ప్రసారం చేయనున్నారు. Sridevi lives forever in not just our hearts but also in the hearts of millions of her fans. Eagerly waiting to watch the unveiling of her figure at Madam Tussauds, Singapore on September 4, 2019. #SrideviLivesForever pic.twitter.com/AxxHUgYnzt — Boney Kapoor (@BoneyKapoor) September 3, 2019 -
అనుష్క శర్మకు అరుదైన గౌరవం
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో ఓప్రా విన్ఫ్రే, పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, లెవిస్ హామిల్టన్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీల మధ్య ఆమె మైనపు విగ్రహం కొలువు తీరనుంది. అయితే గతంలో ఇక్కడ ఉన్న మైనపు బొమ్మలకు, అనుష్క మైనపు విగ్రహానికి ఓ వ్యత్యాసం ఉందట. ఈ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మాట్లాడే అనుష్క మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఇక్కడ కొలువుతీరిన మైనపు బొమ్మలతో ఆయా సెలబ్రిటీల అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. అయితే అనుష్క ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన సెలబ్రిటీతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అనుష్క మైనపు బొమ్మకు వద్ద ఏర్పాటు చేసిన ఫోన్‌ను పట్టుకుంటే అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తుంది. ప్రపంచంలో మరే ఇతర సెలబ్రిటీకి దక్కని అరుదైన గౌరవం తమ అభిమాన నటికి సింగపూర్‌లో దక్కిందన్న విషయం తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క మైనపు విగ్రహంపై టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ.. చాలా మంది అతిథులు, అభిమానులు, ఔత్సాహికులు ఇక్కడికి తరచుగా వస్తుంటారు. అనుష్క శర్మ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారి కోరిక మేరకు, అనుష్కకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మాట్లాడే మైనపు బొమ్మను ఏర్పాటు చేసి ఆమెను గౌరవించాలని భావించినట్లు వివరించారు. -
తుస్సాడ్స్ లో కొలువుతీరిన మోదీ
లండన్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైనపు బొమ్మ కొలువు తీరింది. ప్రజలకు నమస్కరిస్తున్నట్టు ఉండే నరేంద్ర మోదీ మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో ఆవిష్కరించారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు ప్రపంచవ్యాప్తంగా 20 నగరాల్లో బ్రాంచ్ మ్యూజియమ్స్ ఉన్న విషయం తెల్సిందే. భారత్‌కు చెందిన జాతిపిత మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నెలకొన్న విషయం తెల్సిందే. తాజాగా ఆ జాబితాలో నరేంద్ర మోదీ కూడా చేరారు. -
ఇక టుస్సాడ్స్ లో మోదీ మైనపు బొమ్మ
న్యూఢిల్లీ: ప్రపంచ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, రాయల్ కుటుంబీకుల సరసన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే చేరబోతున్నారు. ఆయన మైనపు విగ్రహాలను ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం రూపొందిస్తోంది. ఆ విగ్రహాలను లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాగ్ బ్రాంచిల్లో ఏర్పాటు చేయనుంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు ప్రపంచవ్యాప్తంగా 20 నగరాల్లో బ్రాంచ్ మ్యూజియమ్స్ ఉన్న విషయం తెల్సిందే. ప్రజలకు నమస్కరిస్తున్నట్టు ఉండే నరేంద్ర మోదీ మైనపు విగ్రహాలను రూపొందించేందుకు మోది ఇట్లో ఇప్పటికే పలు సిట్టింగ్‌లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మ్యూజియం వర్గాలు వివిధ భంగిమల్లో మోదీ కొలతలను తీసుకున్నారు. మ్యూజియంలో ఇప్పటికే ఉన్న పలువురు ప్రముఖ నేతల సరసన తన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాను తగునా అని కూడా తమతో మోదీ సందేహం వ్యక్తం చేశారని మ్యూజియం వర్గాలు తెలిపాయి. ‘ప్రజల మనోభావాల మేరకు మీరీ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు కనుక నాకు అభ్యంతరం లేదు’ అని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారట. తాను మూడు, నాలుగు సార్లు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను సందర్శించానని, వృత్తి పట్ల అంకిత భావం, కళా నైపుణ్యం ఎంతో ప్రశంసనీయమని కూడా మోదీ మ్యూజియం వర్గాలతో వ్యాఖ్యానించారట. మోదీ తన సహజసిద్ధ శైలిలో అంటే క్రీమ్ కలర్ కుర్తా, దానిపై జాకెట్ ధరించి నమస్కరిస్తున్నట్లుగా ఆయన మైనపు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ విషయంలో మోదీ సిట్టింగ్స్‌కు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. భారత్‌కు చెందిన జాతిపిత మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నెలకొన్న విషయం తెల్సిందే.