తుస్సాడ్స్ లో కొలువుతీరిన మోదీ | PM Narendra Modi's wax statue unveiled at Madame Tussaud's Museum | Sakshi
Sakshi News home page

తుస్సాడ్స్ లో కొలువుతీరిన మోదీ

Published Thu, Apr 28 2016 6:13 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

PM Narendra Modi's wax statue unveiled at Madame Tussaud's Museum

లండన్:  ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైనపు బొమ్మ కొలువు తీరింది. ప్రజలకు నమస్కరిస్తున్నట్టు ఉండే నరేంద్ర మోదీ మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో ఆవిష్కరించారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు ప్రపంచవ్యాప్తంగా 20 నగరాల్లో బ్రాంచ్ మ్యూజియమ్స్ ఉన్న విషయం తెల్సిందే. 

భారత్‌కు చెందిన జాతిపిత మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నెలకొన్న విషయం తెల్సిందే. తాజాగా ఆ జాబితాలో నరేంద్ర మోదీ కూడా చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement