నటిగా తన పరిధిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అలనాటి నటి శ్రీదేవి కూతురు అయిన ఈమె ధడక్ అనే హిందీ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను రాబట్టుకుంటోంది. అయితే తన తల్లి శ్రీదేవి 1980 – 90 ప్రాంతంలో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా రాణించారు.
సౌత్‌లో రాణించాలని జాన్వీ ప్లాన్
దీంతో జాన్వీ కపూర్ కూడా దక్షిణాది చిత్రాల్లో నటించాలని చాలాకాలం నుంచి బలంగా కోరుకుంటోందట. అదేవిధంగా దక్షిణాది దర్శక నిర్మాతలు కూడా ఆమెను తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది జాన్వీ. అలాగే ఈ బ్యూటీ తమిళ చిత్రాల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అందులో భాగంగా తమిళ చిత్రాలు ఎక్కువగా చూస్తున్నారట.
ఆ ఇద్దరు హీరోలతో ఓకే, కానీ..
ఈ క్రమంలో ఆమె తండ్రి ఒక కండీషన్ పెట్టాడంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హీరో ధనుష్‌కు జంటగా నటించరాదన్నదే ఆ కండిషన్ అంట. హీరో విజయ్ లేదా అజిత్ సినిమాల ద్వారా తన కూతురిని కోలీవుడ్‌లో పరిచయం చేయాలని బోనీకపూర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంతుందో కానీ, కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగిన ధనుష్ సరసన నటించరాదని తన కూతురికి బోనీకపూర్ ఎందుకు కండీషన్ పెడుతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment