తమిళ హీరో అజిత్
కొద్ది రోజులుగా కోలీవుడ్ లో ఆసక్తికర వార్త ఒకటి హల్‌చల్ చేస్తోంది. తమిళ టాప్ హీరో అజిత్, బాలీవుడ్ బడా నిర్మాత బోనీకపూర్ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఖాకీ సినిమాతో ఆకట్టుకున్న హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందన్న ప్రచారం బలంగా వినిపించింది. శ్రీదేవి కుటుంబానికి అజిత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా ఇంగ్లీష్ వింగ్లీష్ లో అజిత్ అతిథిపాత్రలో నటించారు. ఈ సాన్నిహిత‍్యం మూలంగానే బోనికపూర్ బ్యానర్ లో అజిత్ సినిమా అంటూ వచ్చిన వార్తలకు బలం చేకూరింది.
అయితే తాజాగా అజిత్ టీం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అజిత్.. శివ దర్శకత్వంలో విశ్వాసం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను అజిత్ ఇంతవరకు నిర్ణయించలేదట. దీపావళి సీజన్‌లో విశ్వాసం సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అజిత్ విశ్వాసం సినిమాలో నటిస్తున్నారు, కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదని అజిత్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment