స్టైయిలిష్‌ లుక్‌లో స్లిమ్‌గా కనిపిస్తున్న బోనీ కపూర్‌! ఎలా తగ్గారంటే..? | Boney Kapoor Showcases His Weight Loss Transformation | Sakshi
Sakshi News home page

స్టైయిలిష్‌ లుక్‌లో స్లిమ్‌గా కనిపిస్తున్న బోనీ కపూర్‌! ఎలా తగ్గారంటే..?

Published Tue, Apr 2 2024 2:26 PM | Last Updated on Tue, Apr 2 2024 3:46 PM

Boney Kapoor Showcases His Weight Loss Transformation  - Sakshi

చిత్ర నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోని కపూరు స్లిమ్‌గా కనిపిస్తున్నారు. చాలా బరువు ఉండే ఆయన మంచి ఫిట్‌నెస్‌ లుక్‌లో ఉన్న ఫోటోలను షేర్‌ చేశారు. తాను బరువుత తగ్గేందుకు ఎలాంటి కసరత్తులు చేశారో వెల్లడించారు. అంతేగాదు తనలా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇంతకీ బోనీ కపూర్‌ వెయిట్‌ లాస్‌ జర్నీ ఎలా సాగిందంటే..

గతంలో 2004లో శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోల్లో బోనీ కపూర్‌ చాలా లావుగా, ఏజ్‌డ్‌ పర్సన్‌లా కనిపించారు. ఆ తర్వాత కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత పలు సందర్భాల్లో కెమరాకు చిక్కిన పోటోల్లో కూడా లావుగానే ఉన్నారు. అలాంటి ఆయాన అనూహ్యంగా 12 కిలోలలకు పైగా బరువు తగ్గడమే గాక న్యూలుక్‌లో కనిపిస్తున్నారు. బోనీ కపూరేనా అనిపించలా కొత్త స్టయిలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. 20 ఏళ్ల క్రితం ఉన్న బోనీకపూర్‌కి ఈ న్యూలుక్‌లో ఉన్న బోనీ కపూర్‌కి ఎంత తేడా అని షాకయ్యేలా విజయవంతంగా బరువుతగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. 

ఈ మేరకు బోనీకపూర్‌ మాట్లాడుతూ.."బరువు తగ్గేందుకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అలాగే తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారే తొందరగా బరువు తగ్గగలరని అన్నారు. అందుకోసం క్రమశిక్షణతో కూడిని జీవనశైలిని అవలంభించాల్సి ఉంటుందన్నారు. తాను బరువు తగ్గే క్రమంలో నటి జాన్వీ కపూర్‌ ఉత్సహాపరిచేలా ప్రోత్సహించిన విషయాన్ని కూడా పంచుకున్నారు. జాన్వీ సోషల్‌ మీడియాలో "నా పాపా బరువు తగ్గడంలో విజంయ సాధించినందుకు గర్వంగా ఉంది." అని పోస్ట్‌ చేసింది. ఇలా తన పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహమే తనను తొందరగా బరువు తగ్గేలా చేసేందుకు దోహదపడిందన్నారు. 

అలాగే తన మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్‌ కూడా బరువు తగ్గే ప్రయత్నంలో కష్టాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆమెకి ప్రేరణ కలిగించేలా తాను బరువు తగ్గేందుకు ఉపక్రమించినట్లు తెలిపారు. అయితే తన కూతురు కూడా చక్కగా బరువు తగ్గి న్యూలుక్‌ మంచి ఫిట్‌నెస్‌తో అందంగా ఉందని చెప్పడమే గాకా ఆమె ఫోటోలను కూడా షేర్‌ చేశారు. తనలా బరువు తగ్గాలనుకునేవారు తగ్గలేకపోతున్నాననే నిరాశకు లోనవ్వకూడదు. చివరి నిమిషం వరకు ఆశను కోల్పోకుండా ఉత్సాహభరితంగా కసరత్తులు చేస్తే దెబ్బకు బరువు తగ్గడం ఖాయ అని అన్నారు. అందుకు తానే నిదర్శనమని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు." బోనీ కపూర్‌.  

(చదవండి: సెలబ్రెటీలు తాగే బ్లాక్‌ వాటర్‌ ఏంటీ? నార్మల్‌ వాటర్‌ కంటే మంచిదా..!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement