
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన పింక్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేయాలనేది శ్రీదేవి చివరి కోరిక అని బోనీ కపూర్ అప్పట్లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ రీమేక్‌లో అజిత్ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అటుపై మళ్లీ కొన్ని రోజుల తరువాత అజిత్ ఎటువంటి రీమేక్‌లో నటించడం లేదంటూ వార్తలు వచ్చాయి.
అయితే మొత్తానికి అజిత్ పింక్ రీమేక్‌లో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అంతేకాకుండా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ రీమేక్ లో కన్నడ స్టార్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాద్ నటిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తోన్న ఈ మూవిని హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment