
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 48 గంటల్లోనే ఆ ఇంట్లో పనిచేసే మరో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. వీరికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోవడం గమనార్హం. బోనీకపూర్ తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లతో కలిసి ముంబైలోని లోఖండ్‌వాలా నివాసంలో ఉంటున్నారు. కాగా తమకు వైరస్ ప్రభావం లేదని, క్షేమంగా ఉన్నామని బోనీకపూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రెండురోజుల కిందట వారి ఇంట్లో పనిచేసే చరణ్ సాహూకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆ ఇంట్లో పనిచేసే వారితో పాటు బోనీకపూర్ కుటుంబ సభ్యులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. బోనీ సహా ఇద్దరు కుమార్తెలకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షలో నెగెటివ్ ఫలితం వచ్చింది. కాగా బోనీకపూర్ తన అభిమానులను ఉద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో తామంతా క్షేమంగా ఉన్నామని, వైరస్ బారిన పడకుండా క్వారంటైన్‌లో ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment