
ముంబై : బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నివాసంలో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడికి నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. తన ఇంట్లో పనిచేసే చరణ్ సాహూ శనివారం అస్వస్థతకు గురవడంతో బోనీకపూర్ శనివారం అతడిని పరీక్షలకు పంపించగా, అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో చరణ్ సాహును బీఎంసీ అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించనున్నారు. కాగా తాను, తన కుమార్తెలు, ఇంట్లో ఉన్న ఇతర సిబ్బంది అందరం బాగానే ఉన్నామని, తమకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని బోనీకపూర్ చెప్పుకొచ్చారు.
లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచీ తాము ఇంట్లోనే ఉన్నామని చెప్పారు. వేగంగా స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ అధికారులను బోనీ కపూర్ ప్రశంసించారు. బీఎంసీ, వైద్యాధికారుల సూనలను తాము విధిగా పాటిస్తున్నామని, చరణ్ సాహూ సైతం త్వరగా కోలుకుని తమ వద్దకు చేరతాడని భావిస్తున్నామని బోనీ కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment